ఎన్ఆర్ఐలకు ఉచిత ప్రవాసాంధ్ర బీమా

ఎన్ఆర్ఐలకు ఉచిత ప్రవాసాంధ్ర బీమా

09-01-2019

ఎన్ఆర్ఐలకు ఉచిత ప్రవాసాంధ్ర బీమా

తెలుగు ఎన్నారైలకు, గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారికి ఉచిత ప్రవాసాంధ్ర భరోసా బీమా కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గల్ఫ్‌లో తెలుగువారు ఎవరైనా మరణించినా, అంగవైకల్యం పొందినా ఈ పథకం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. ప్రమాదంలో గాయపడ్డవారికి రూ.లక్ష, ఉద్యోగాల్లో యాజమాన్యాలతో వివాదాలు వచ్చినప్పుడు న్యాయ సహాయం కింద రూ.45వేలు అందిస్తాం. ఉద్యోగం కోల్పోతే స్వదేశానికి తిరిగి రావటానికి ఉచితంగా టికెట్లు, ప్రసూతి సాయం కింద రూ.50వేలు ఇవ్వడం ఈ బీమా పథకంలో ముఖ్యమైనవని సీఎం వివరించారు. గల్ఫ్‌లో పని చేస్తున్న తెలుగు వారంతా వెంటనే ఈ బీమా సౌకర్యం పొందడానికి రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. ప్రవాసాంధ్ర దివ్‌సని పురస్కరించుకుని ఏపీ నాన్‌రెసిడెంట్‌ తెలుగు సొసైటీ సభ్యులు బుధవారం సీఎంను కలిశారు.

ఈ సందర్భంగా ప్రవాసాంధ్ర దివస్‌ పోస్టర్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఎన్‌ఆర్‌టీ సీఈవో భవానీశంకర్‌, తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన, కోఆర్డినేటర్‌ బుచ్చి రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.