ట్రంప్ పన్ను వివాదం: క్లియర్ చేసిన వైట్ హౌస్
Ramakrishna

ట్రంప్ పన్ను వివాదం: క్లియర్ చేసిన వైట్ హౌస్

15-03-2017

ట్రంప్ పన్ను వివాదం: క్లియర్ చేసిన వైట్ హౌస్

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పన్ను చెల్లింపు వివరాలను తాజాగా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వెల్లడించింది. 2005లో ట్రంప్‌ 150 మిలియన్‌ డాలర్లు (రూ. 986 కోట్లు) ఆర్జించి.. 38మిలియన్‌ డాలర్ల (రూ. 249 కోట్ల) పన్ను కట్టారని పేర్కొంది. ట్రంప్‌ పన్ను చెల్లింపు వివరాలను  తాము రాబట్టినట్టు ఎంఎస్‌ఎన్బీసీ నెట్‌వర్క్‌ ప్రకటించిన నేపథ్యంలో వైట్‌హౌస్‌ ఈప్రకటన చేసింది. ఎంఎస్‌ఎన్బీసీ తన వెబ్‌సైట్‌లో ట్రంప్‌ 25శాతం ఎఫెక్టివ్‌ రేటును పన్నును మాత్రమే చెల్లించారని, 100 మిలియన్‌ డాలర్ల నష్టాన్ని ఆయన లెక్కల్లో చూపించారని వెల్లడించిన సంగతి తెలిసిందే.