అమెరికా మహిళలు బహు పరాక్...

అమెరికా మహిళలు బహు పరాక్...

15-03-2017

అమెరికా మహిళలు బహు పరాక్...

చికాగో శివార్లలోని అర్లింగ్టన్ హైట్స్‌లోని అట్లాంటిస్ బన్‌కెట్ వేదికగా గ్రేటర్ చికాగో తెలుగు సంస్థ (టీఏజీసీ) మహిళా దినోత్సవంఘనంగా జరిగింది. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో దాదాపు 250 మందిపైగా మహిళలు పాల్గొన్నారు. దీంతో కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.మహిళాఆత్మగౌరవం, అన్ని రంగాల్లో మహిళల విజయాలు, మారుతున్న సమాజ పరిస్థితులు తదితర అంశాలపై స్త్రీలకు అవగాహనఉండాలని, స్త్రీలు సమాజ అభివృద్ధిలో ముందుండాలనే ఉద్దేశ్యంతో టీఏజీసీ ఈ కార్యక్రమాన్ని ప్రతియేటా నిర్వహిస్తోంది. 

శిరీష రామచంద్రా రెడ్డి ఏడే, మమతా లంకల, వాణి ఏట్రింతల, హరిప్రియలు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.మాధవిలతా గణపతి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. టీఏజీసీ మహిళా కమిటీ ఆధ్యక్షులు వాణి ఏట్రింతల కార్యక్రమానికివిచ్చేసిన వారికి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం స్థానిక ప్రముఖ న్యాయవాది హరిప్రియ మెదుకుందం అమెరికాలోనివసిస్తున్నవారి కోసం ఆస్తుల భీమా, దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆర్థిక స్వతంత్రం వంటి విషయాలపై సభ్యులకుఅనేక సూచనలు, సలహాలు అందించారు. మహిళా వైద్యులు డా. స్మిత, డా. వినీతలను ఈ కార్యక్రమానికి  ఆహ్వానించారు.

డా.స్మిత మాట్లాడుతూ.. శారీరక, మానసిక, ఆరోగ్య విషయాలపై సభ్యులకు సూచనలు సలహాలు అందించారు. ఆహారపుఅలవాట్లు, ఆవశ్యకత గురించి వివరించారు. డా.వినీత కుంచాల మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్ డిఅవసరాన్ని వివరించారు. కాల్షియం, విటమిన్ డి ఎలా పొందాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రసంగించిన వారినిటీఏజీసీ తరుపున శిరీష ఏడే, మమతా లంకల శాలువాతో సన్మానించారు. జ్ఞాపికలను అందజేశారు. 

ఆట పాటలతో మహిళా దినోత్సవం ఎంతో ఉత్సాహంగా సాగింది. మానస లత్తుపల్లి గారు నేతృత్వంలో ఆటలపోటీలునిర్వహించారు. గెలుపొందిన వారికి ఈ బహుమతులను శిరీష ఏడే అందజేశారు. కార్యక్రమానికి కూల్‌మిర్చి ఇండియన్రెస్టారెంట్ సహాయసహకారం అందించారు. సాయంత్ర స్నాక్స్, రాత్రి భోజనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిననిధులు, కార్యక్రమ సభ్యత్వ రుసుములో నుంచి కొంత భాగాన్ని టీఏజీసీ డిజైర్ సొసైటీకి విరాళంగా అందజేశారు. డిజైర్ సొసైటీవారు భారతదేశంలో ఎయిడ్స్ వ్యాధి సోకిన పిల్లలు, అనాథ బాలికలకు సహాయ సహకారాలను అందిస్తోంది. టీఏజీసీ మహిళాకమిటీ అధ్యక్షురాలు వాణి ఏట్రింతల, కమిటీ సభ్యులు అర్చన ప్రొద్దుటూరి, మానస లత్తుపల్లి, మమతా లంకల మహిళాదినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు.

కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రతిఒక్కరికీ వారికి టీఏజీసీ సంస్థ తరుపున వాణి ఏట్రింతల గారు ధన్యవాదాలు తెలిపారు.మమతా లంకల, కోశాధికారి వెంకట్ గుణుకంటి, శ్వేతా గట్టు, కూల్‌మిర్చి రెస్టారెంటు అరుణ గూడూరు, ఉమా అవధూత,విజయ్ భీరం, ఆటలపోటీలను నిర్వహించిన మానస లత్తుపల్లి, డీజే. సహిల్‌, కోఆర్డినేటర్వందనరెడ్డీలకు ప్రత్యేకంగాకృతజ్ఞతలు తెలియజేశారు. టీఏజీసీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే ఈ  కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికిసహాయ సహకారాలు అందించిన మహిళా కమిటీ సభ్యులు, నిర్వహణలో తోడ్పడ్డ ప్రతి కమిటీ సభ్యులు, వాలంటీర్లలకు ధన్యవాదాలు తెలియజేశారు.


Click here for Photogallery