మళ్ళీ ఎన్నికైన రాజా, ప్రమీలా, రో ఖన్నా, అమీబెరా

మళ్ళీ ఎన్నికైన రాజా, ప్రమీలా, రో ఖన్నా, అమీబెరా

09-11-2018

మళ్ళీ ఎన్నికైన రాజా, ప్రమీలా, రో ఖన్నా, అమీబెరా

అమెరికా ప్రతినిధుల సభలో ఇండో-అమెరికన్ల గ్రూపు తాజా మధ్యంతర ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటి వరకూ ఉన్న రాజా కష్ణమూర్తి, ప్రమీలా జయపాల్‌, రో ఖన్నా, అమీ బెరా మళ్లీ ఎన్నికయ్యారు తప్ప... కొత్తగా ఈ గ్రూపు బలం పెరిగిందేమీ లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ మధ్యంతర ఎన్నికల్లో వందమందికిపైగా ఇండో-అమెరికన్లు బరిలోకి దిగారు. వీరిలో 50 మంది మంగళవారం జరిగిన ఎన్నికల్లోనే తమ అదష్టాన్ని పరిశీలించుకున్నారు.

ఇందులో అప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురితో సహా 12 మంది ప్రతినిధుల సభకు పోటీ చేయగా... ఒకరు సెనెట్‌ బరిలో ఉన్నారు. ప్రతినిధుల సభకు పోటీ చేసిన వారిలో అరడజనుకుపైగా 'సమోసా కాకస్‌' సభ్యులు తమ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తారని ప్రచారం జరగడంతో ఈ ఎన్నికలపై సర్వతా ఆసక్తి నెలకొంది.