అమెరికాలో సమోసా సత్తా చాటేనా?

అమెరికాలో సమోసా సత్తా చాటేనా?

06-11-2018

అమెరికాలో సమోసా సత్తా చాటేనా?

అమెరికా కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న ఐదుగురు భారతీయ-అమెరికన్‌ సభ్యులను కలిపి సమోసా కాకస్‌ అని అనధికారికంగా పిలుస్తారు. కృష్ణమూర్తే ఈ పేరును బృందానికి పెట్టారు. తాజా మధ్యంతర ఎన్నికలతో సమోసా బృందంలోని సభ్యుల సంఖ్య పెరుగుతుందని అంచనా. ఈ ఎన్నికలు చాలామంది కొత్త వారిని ప్రతినిధుల సభ, రాష్ట్రాల శాసన సభలకు పంపుతాయని రిచ్‌ వర్మ తెలిపారు. ఆరిజోనా నుంచి టెక్సాస్‌, ఒహయో, మిషిగాన్‌ల వరకు.. పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత అమెరికన్‌ కాంగ్రెస్‌లో మన బలం పెరుగుతుందన్న నమ్మకం ఉందంటున్నారు కృష్ణమూర్తి. ట్రంప్‌ విధానాలతో అమెరికన్లు, ముఖ్యంగా భారతీయ అమెరికన్లు తీవ్ర భయాందోళనలకు గురువుతున్నారనీ, తమ భయాన్ని, నిరసనను గట్టిగా చెప్పడం కోసమే ఈసారి అనేక మంది భారతీయ అమెరికన్లు బరిలోకి దిగారని వర్మ తెలిపారు. మధ్యంతరంలో పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్లలో ఎక్కువ మంది డెమొక్రటిక్‌ పార్టీ తరపున నిలబడ్డారు.