దాడులపై భారతీయ అమెరికన్లకు అవగాహన

దాడులపై భారతీయ అమెరికన్లకు అవగాహన

15-03-2017

దాడులపై భారతీయ అమెరికన్లకు అవగాహన

అమెరికాలో భారతీయులపై వరుస దాడుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు అవగాహన కల్పించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇండియన్‌ అమెరికన్‌ పబ్లిక్‌ అఫైర్స్‌గా పిలిచే ఈ కమిటీని నలుగురు భారతీయ అమెరికన్లు ఇటీవలే చికాగోలో స్థాపించారు. అమెరికా ప్రజలతో భారతీయులు ఎలా కలిసిపోయారన్న దానిపై దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థాపకుల్లో ఒకరైన అశ్వనీధాల్‌ మాట్లాడుతూ అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి ప్రజల మనోభావాల్ని, వారి ఆసక్తుల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. శాన్‌ఫ్రాన్సికో బే ఏరియా, న్యూయార్క్‌, న్యూజెర్సీ, చికాగో, డాలస్‌, సియాటిల్‌లో కమిటీ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.