ప్రతిభకే పట్టం .. అలాంటివారే ఇక్కడకు రావాలి

ప్రతిభకే పట్టం .. అలాంటివారే ఇక్కడకు రావాలి

15-10-2018

ప్రతిభకే పట్టం .. అలాంటివారే ఇక్కడకు రావాలి

వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ప్రతిభావంతులు తమ దేశంలోకి ప్రవేశించాలన్నది తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన వల్ల భారత్‌ వంటి దేశాల నుంచి వచ్చే సాంకేతిక నిపుణులకు ప్రయోజనం కలుగుతుంది. సరిహద్దుల వద్ద నేను చాలా కఠినంగా ఉంటా. విదేశీయులు మా దేశంలోకి చట్టబద్ధంగా మాత్రమే రావాలి. అక్రమంగా కాదు. వారు ప్రతిభ ప్రాతిపదికన రావాలని కోరుకుంటున్నా అని ట్రంప్‌ వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆర్థిక రంగంలో అమెరికా ప్రపంచంలోనే అత్యద్భుతంగా రాణిస్తోందని అన్నారు.