వాతావరణం అనుకూలంగా లేదు.. ఆగిపోండి

వాతావరణం అనుకూలంగా లేదు.. ఆగిపోండి

15-03-2017

వాతావరణం అనుకూలంగా లేదు.. ఆగిపోండి

జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ అమెరికా పర్యటన ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. ముందుగా నిర్ణయించుకునన షెడ్యూల్‌ ప్రకారం ఏంజెలా మెర్కెలా అమెరికా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమెకు ఫోన్‌ చేసి, ప్రస్తుతం అమెరికాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని ఆంగిపోండి అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, జర్మనీ ఛాన్సలర్‌ మెర్కెల్‌ నేడు సమావేశం కావాల్సి ఉంది. దీంతో వాషింగ్టన్‌ వెళ్లేందుకు మెర్కెలో బెర్లిన్‌లోని ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. అమె ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారనగా,  ట్రంప్‌ ఆమెకు ఫోన్‌ చేసి అమెరికా రావొద్దని కోరారు. ఈ విషయాన్ని మెర్కెల్‌ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని అందుకే రావొద్దని చెప్పినట్టు ఆమె వివరించారు.