భారతీయ అమెరికన్ కు రూ.47.25 కోట్ల ప్రోత్సాహకం

భారతీయ అమెరికన్ కు రూ.47.25 కోట్ల ప్రోత్సాహకం

12-09-2018

భారతీయ అమెరికన్ కు రూ.47.25 కోట్ల ప్రోత్సాహకం

కీలక క్యాన్సర్‌ నిర్ధారణ సూచీలను (బయోమార్కర్లు) గుర్తించిన భారతీయ అమెరికన్‌ పరిశోధకుడు అరుల్‌ చిన్నయ్యన్‌కు రూ.47.25 కోట్ల (6.5 మిలియన్ల డాలర్లు) నగదు ప్రోత్సాహకం దక్కింది. వ్యాధి నిర్థారణ, కొత్త చికిత్సా విధానాల అభివృద్ధిలో ఈ సూచీలు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది. దీంతో అమెరికా జాతీయ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (యూఎస్‌ఎన్‌సీఐ) ఈ ప్రోత్సాహకాన్ని అందించింది. మిషిగన్‌ వర్సిటీలో అధ్యాపకుడిగా అరుల్‌ పనిచేస్తున్నారు. ఏడేళ్ల సమయంలో పరిశోధనలకు ప్రోత్సాహకంగా యూఎస్‌ఎన్‌సీఐ ఈ మొత్తాన్నీ అందిస్తుందని మిషిగన్‌ వర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.