అమెరికాకు మరో హరికేన్ ముప్పు

అమెరికాకు మరో హరికేన్ ముప్పు

12-09-2018

అమెరికాకు మరో హరికేన్ ముప్పు

హార్వే, ఇర్మా హరికేన్ల దెబ్బనుంచి అమెరికా కోలుకోకముందే మరో ముప్పు ముంచుకొస్తున్నది. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన శక్తిమంతమైన ప్లారెన్స్‌ హరికేన్‌ అమెరికా తూర్పుతీరం వైపు కదులుతూ పుంజుకుంటున్నది. ఇది క్యాటగిరి-4 హరికేన్‌గా బలపడుతున్నదని జాతీయ హరికేన్‌ కేంద్రం ప్రకటించింది. ఈ హరికేన్‌ ప్రస్తుతం బెర్ముడాకు 1100 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఉత్తర కరోలినా, వర్జీనియా రాష్ట్రాల మధ్య హరికేన్‌ గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొన్నది. తీరం దాటే సమయంలో కుండపోత వర్సాలు కురుస్తాయని గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

హరికేన్‌  ప్లారెన్స్‌ అమెరికా తుర్పు తీరంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా 10 లక్షల మందిని అప్రమత్తం చేసినట్లు దక్షిణ కరోలినా గవర్నర్‌ మెక్‌మాస్టర్‌ తెలిపారు. చాలా ఏండ్ల తర్వాత తూర్పుతీరాన్ని తాకుతున్న బలమైన హరికేన్‌ ఇది. ప్రజలందరూ అన్నిటికీ సిద్ధంగా, జాగ్రత ఉండండి అని దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు.