ఐఫోన్లు అమెరికాలోనే : ట్రంప్

ఐఫోన్లు అమెరికాలోనే : ట్రంప్

10-09-2018

ఐఫోన్లు అమెరికాలోనే : ట్రంప్

చైనా వస్తువులపై ఇప్పటి వరకు సుంకాలతో సరిపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు కొత్త దాడికి సిద్ధమవుతున్నారు. యాపిల్‌ కంపెనీ ఐఫోన్లతో సహా తన ఉత్పత్తుల తయారీని చైనా నుంచి ఆమెరికాకు తరలించాలని కోరారు. చైనాపై తన ప్రభుత్వం ప్రారంభించిన వాణిజ్య యుద్ద పర్యవసానాలు తట్టుకోవాలంటే ఇదొక్కటే మార్గమన్నారు. చైనా ఉత్పత్తులపై మనం విధిస్తున్న భారీ సుంకాలతో యాపిల్‌ ఉత్పత్తుల ధర పెరగొచ్చు. ఆ కంపెనీ తన ఉత్పత్తుల తయారీని అమెరికాకు తరలించడం ఒక్కటే ఇందుకు పరిష్కారం. కంపెనీ ముందుకు వస్తే టన్నుల ప్రోత్సాహం తోపాటు ఎలాంటి పన్నుల భారం విధించం అని అన్నారు.