ప్రవాస భారతీయులు దేశానికి రాయబారులు

ప్రవాస భారతీయులు దేశానికి రాయబారులు

10-09-2018

ప్రవాస భారతీయులు దేశానికి రాయబారులు

దేశాభివృద్ధికి ప్రవాస భారతీయులు ఎనలేని సేవలు అందిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి అమన్‌ సిన్హా పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రవాస భారతీయులు ఏటా 70 బిలియన్‌ డాలర్లను మాతృదేశానికి పంపుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచ హిందూ మహాసభలో పాల్గొనేందుకు షికాగో వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3 కోట్ల మంది ప్రవాస భారతీయులు.. దేశానికి రాయబారులని చెప్పారు. వారికి సాధికారత కల్పిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. విదేశాల్లో ఉన్న భారత పౌరులకూ ఓటు హక్కు కల్పించామని పేర్కొన్నారు.