నైకీ వస్తువులను తగులబెడుతున్న అమెరికన్లు

నైకీ వస్తువులను తగులబెడుతున్న అమెరికన్లు

05-09-2018

నైకీ వస్తువులను తగులబెడుతున్న అమెరికన్లు

ప్రముఖ క్రీడావస్తువుల తయారీ సంస్థ నైకీపై అమెరికన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ బ్రాండ్‌ వస్తువులు కనిపిస్తే చాలు తీసుకెళ్లి తగులబెడుతున్నారు. ఇన్వెస్టర్లు తమ షేర్లు అమ్ముకుంటున్నారు. అసలు నైకీ మొత్తాన్నే నిషేధించాలని మరికొందరు ఆందోళనలు చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఆ సంస్థ చేసిన కొత్త యాడ్‌. ఈ కొత్త ప్రకటనలో నేషనల్‌ పుట్‌బాల్‌ లీగ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) స్టార్‌ కొలిన్‌ కేపర్‌నిక్‌ నటించాడు. అయితే ఆ యాడ్‌లో ఆమెరికా జాతీయ గీతం వస్తున్న సమయంలో కేపర్‌నిక్‌ మోకాళ్లపై కూర్చున్నట్లుగా చూపించడం అమెరికన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇదో దారుణమైన సందేశమిచ్చే ప్రకటన అని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ యాడ్‌ చూసినప్పటి నుంచీ అమెరికన్లు నైకీ వస్తువుల తగులబెడుతూ ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తమ నిరసన తెలుపుతున్నారు.