సిఎన్‌ఎన్‌ 'షో'పై హిందువుల గుర్రు

సిఎన్‌ఎన్‌ 'షో'పై హిందువుల గుర్రు

14-03-2017

సిఎన్‌ఎన్‌ 'షో'పై హిందువుల గుర్రు

బిలీవర్‌ విత్‌ రెజా అస్లాన్‌ సీఎన్‌ఎన్‌లో ప్రసారమవుతన్న ఈ ఆరువారాల షోలో హిందూ మతాన్ని కించపరచడంపై అమెరికాలోని హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ షోను నిర్వహించే వ్యక్తి పేరు అస్లాన్‌. ఇరాన్‌ సంతతికి చెందిన అమెరికన్‌ అతడు.తన షోలో భాగంగా అతడు ఇజ్రాయెల్‌లోని అతివాద సంప్రదాయ యూదుల నుంచి, హైతీలోని క్షుద్ర మంత్రగాళ్ల దాకా, అమెరికాలో సైంటాలజీని అనుసరించేవారి నుంచి ఇండియాలో అఘెరాల దాకా రకరకాల సాధనా పద్ధతులను చిత్రీకరించాడు. ఈ కోవలోనే అతడు భారత్‌లో వారణాసికి వచ్చి అఘెరాల జీవితాన్ని చిత్రీకరించాడు. ఈ క్రమంలోనే అతడు హిందూ మతాన్ని కావాలని కించపరిచే ప్రయత్నం చేశాడని ఆరోపణ. వారణాసిని మృత్యునగరం (టౌన్‌ ఆఫ్‌ డెత్‌)గా అతను ఈ షో అభివర్ణించడం వివాదానికి దారి తీసింది. ఈ షోలో తొలి ఎసిసోడ్‌లోని అఘెరాల గురించి ప్రసారమైంది. దీనిపై అమెరికాలోని హిందువులంతా భగ్గుమన్నారు. అఘెరాల్లో తప్పుడు వ్యక్తులను ఎన్నుకుని హిందూమతాన్ని కించపరిచేలా చూపాడని వారు మండిపడుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు హిందువులు మద్దతిచ్చినందుకే సీఎన్‌ఎన్‌ ఇలా హిందూమతంపై దాడికి దిగిందని ఆరోపించారు. 16 ధార్మిక సంస్థలతో కూడిన అమెరికన్‌ హిందూస్‌ ఎగెనెస్ట్‌  డిఫమేషన్‌ న్యూయార్క్‌లో ఈ మేరకు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపింది. హిందువులపై విద్వేషాన్ని పెంచే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది.