ట్రంప్‌ హెల్త్‌ కేర్‌ ఇది...

ట్రంప్‌ హెల్త్‌ కేర్‌ ఇది...

14-03-2017

ట్రంప్‌ హెల్త్‌ కేర్‌ ఇది...

అమెరికా ప్రజల ఆరోగ్యం కోసం ఒబామాకేర్‌ స్థానంలో తమ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఆరోగ్య ప్రణాళికకు మద్దతునివ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చట్టసభ సభ్యులను కోరారు. ఏడేండ్ల కిందట ఒబామాకేర్‌ను ప్రతిపాదిస్తూ చెప్పిన హామీలేవీ సాకారం కాలేదని విమర్శించారు. ఒక కుటుంబానికి ప్రీమియంను 2500 డాలర్లకు తగ్గిస్తామని చెప్పారని,  కానీ అది 4500 డాలర్లను దాటిపోయిందని ఆయన  ప్రతివారం నిర్వహించే రేడియో, వెబ్‌ ప్రసంగం కార్యక్రమంలో పేర్కొన్నారు. ప్రముఖ ఇండో అమెరికన్‌ ప్రాసిక్యూటర్‌ ప్రీత్‌ భరారాతోపాటు మొత్తం 46  మంది అటార్నీలు వైదొలుగాల్సిందిగా ట్రంప్‌ ప్రభుత్వం కోరింది. ఒబామా హయాంలో నియమితులైనవారు రాజీనామా చేయాల్సిందిగా వారిని కోరినట్లు న్యాయశాఖ ప్రతినిధి సారా ఇస్గర్‌ ఫ్లోర్స్‌ తెలిపారు.