ప్రపంచవేదికపై ఐశ్వర్య నృత్యం

ప్రపంచవేదికపై ఐశ్వర్య నృత్యం

14-03-2017

ప్రపంచవేదికపై ఐశ్వర్య నృత్యం

అంతర్జాతీయ మహళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌   కుమార్తె ఐశ్వర్య భరతనాట్యాన్ని ప్రదర్శించింది. తన ప్రదర్శన ద్వారా లింగ సమానత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు సంబంధించిన భారత్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధిగా ఐశ్వర్య వ్యవహరిస్తున్నారు. ప్రారంభంలో నటరాజస్వామిని స్తుతిస్తూ భో శంభో అనే పాటకు అమె చేసిన నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సుప్రసిద్ధ గాయిని ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాడిన మైత్రీమ్‌ భజతే పాటకు చేసిన నృత్యం ద్వారా కార్యక్రమం ముగిసింది. ఈ ప్రదర్శనను తిలకించడానికి ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు పీటర్‌ థామ్సన్‌ సహా పలువురు దౌత్యవేత్తలు, అధికారుల హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రదర్శన ఇచ్చే అవకాశం రావడం తనకు గొప్ప గౌరవమని ఐశ్వర్య పేర్కొన్నారు.