నాటాలో ఆదిత్య అద్భుత నృత్య ప్రదర్శన!

నాటాలో ఆదిత్య అద్భుత నృత్య ప్రదర్శన!

12-07-2018

నాటాలో ఆదిత్య అద్భుత నృత్య ప్రదర్శన!

భారత ప్రభుత్వ కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కళా రత్న అవార్డు మరెన్నో అవార్డులు రావడం అంత సులభం కాదు. అర్ధ శతాబ్దం పైనే పట్టు విడువని కృషి,ఏకాగ్రత, సాధించాలనే తపన, కళకోసం అహర్నిశలు అలుపెరుగని పయనం, కళామతల్లి కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలవాలనే పట్టుదల శ్రీమతి బాల కొండల రావును కళామతల్లిముద్దుబిడ్డగా మార్చాయి,  కళారత్న, కేంద్ర సంగీత అకాడమీ గుర్తింపేకాదు శ్రీమతి బాలకు మరెన్నో ఎన్నో అసాధ్యాలు సుసాధ్యాలుగా మారాయి.

విశాఖపట్నంలో కూచిపూడి కళాకేంద్రంస్థాపించిన శ్రీమతి బాల పద్మవిభూషణ్ వెంపటి చిన సత్యం శిష్యురాలు. మద్రాస్  కూచిపూడి ఆర్ట్ అకాడెమీలో తొమ్మిదవ ఏట నృత్యాభ్యాసానికి శ్రీకారం చుట్టి శ్రీ వెంపటి అభిమాన శిష్యురాలిగాఎదిగి బాలక్కగా కొన్నివందలమందిని ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దిన ప్రముఖ కళాకారిణి శ్రీమతి బాల. జులై 6-8 వరకు ఫిలడల్ఫియాలో అత్యంత వైభవంగా జరిగిన నాటా మెగా కన్వెన్షన్లో శ్రీమతి బాల నృత్య రచన చేసి దర్శకత్వం వహించిన శ్రీ లలితా భండాసుర చరితం నృత్య నాటకం ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. శ్రీమతి బాల కుమారుడు అనుకుల ఆదిత్య భండాసురుడిగా ప్రదర్శించిన హావభావాలు, రాక్షసవిన్యాసాలు అద్భుతం. ఆదిత్య ఆంగికాభినయమే కాదు చక్కని ఆహార్యం, మరింత చక్కనైన రసాభినయం చేసి ప్రేక్షకుల్ని అలరించారు. శ్రీ లలితా దేవిగా నృత్య సేవమాని గురు శ్రీమతి దివ్య ఏలూరి వీర, రౌద్ర రసాల్ని అద్భుతంగా ప్రదర్శించారు. శ్రీమతి దివ్య, శ్రీ ఆదిత్య ఇద్దరు శ్రీమతి బాల వద్ద శిక్షణ పొందడం విశేషం.

శివుని ఆగ్రహానికి గురైన మన్మధుడు భస్మమవుతాడు ఆ భస్మంలోంచి పుట్టినవాడే భండాసురుడు. అతిపరాక్రమవంతుడు దేవతలకి నరకయాతనలు చూపుతాడు. శ్రీ లలితాదేవి దేవతలకోరికని మన్నించి భండాసురుణ్ణి సంహరించడం ఈ నృత్య రూపకం ఇతివృత్తం. శివుడిగా ఉమా రాయసం, పార్వతిగా ఆశ ఏలూరి,  కామేశ్వరిగా సాయి ఐశ్వర్య నీలంరాజు, బాల భండాసురగా కార్తీక్ గాంధీ, యుక్తవయసు భండాసురగా అక్షయ్ ఏలూరి,   శ్రీ మహావిష్ణుగా సమీరా బోగా, శ్రీ మహాలక్ష్మిగా లలిత వడ్లమాని, బ్రహ్మగా రఘురాం రాయసం సరస్వతిగా శివాని తన్నీరు మన్మథుడిగా ప్రజాపతి భోగ,  చిత్ర కర్మాగా వర్ష రాయసం, ఇంద్రుడు మరియు శచీదేవిగా పారిజాత బోగ మరియు శైలజ ముక్కవల్లి మరియు మోహినిగా అంజలి సుఖవాసితో పాటు స్నేహ భూపతి, అమృత వడ్లమాని, సమీరా బోగ, కామ్య రాయసం, సోనాల్ తన్నీరు, త్రిష వెలిగిలేటి, శ్రీ తనిష్క ముమ్మిడి, కోమల జ్వాలాపురం, కృష్ణవేణి రెండుచింతల, వర్ష రాయసం, ఆరోహి దండవాతె, స్వాతి లక్ష్మి వెలిగలేటి, ఆశ ఏలూరి, సాయి ఐశ్వర్య నీలంరాజు, అదితి రామసాగరం, నిశిత మరియు వర్ష వెలగలేటి, సాయి రెండుచింతల, లక్ష్మి రెండుచింతల, భవజ్ఞ దగ్గుమతి,వరేణ్య కోపల్లె, సవీణ బోగ, అక్షర మరియు శర్మిష్ట దేవతలుగా, సఖులుగా భండాసురిని స్నేహితులుగా పాల్గొన్నారు.  

ఈ నృత్య రూపకానికి సాహిత్యం శ్రీ నల్లా చక్రవర్తి జగన్నాధాచార్యులు,సంగీతం శ్రీ బుచ్చయ్యచార్యులు సమకూర్చారు. నాటా మెగా కన్వెన్షన్లో ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీ లలితా భండాసుర చరితం ప్రేక్షకుల అత్యంత అభిమానాన్ని చూరగొందిఅంటే ఆశ్చర్యం లేదు. మెగా కన్వెన్షన్లో మెయిన్ స్టేజి మీద ఇంతటి రసవత్తరమైన నృత్యనాటకాన్ని ప్రదర్శించక పోవడం కళాభిమానుల్ని కొంత నిరాశపరచింది. ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాల్ని 3 రోజులపాటు అందించి కళాభిమానులకి కనువిందు చేసిన నాటా కల్చరల్ టీం ఎంతైనా అభినందనీయులు.

Dr. Ramana Vasili
Founder, Spiritual Foundation, Inc.
7062 S Beringer Drive,
Cordova, TN 38018
ramanavvasili@hotmail.com
901-387-9646

Click here for Event Gallery