అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ మరో ఔషధం

అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ మరో ఔషధం

12-07-2018

అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ మరో ఔషధం

మలేరియా, లుపస్‌ ఎరిథెమాటోనస్‌, రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ చికిత్సకు వినియోగించే హైడ్రోజైక్లోరోక్విన్‌ సల్ఫేట్‌ టాబ్లెట్లను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరెటరీస్‌ తెలిపింది. ఈ టాబ్లెట్లు 200 ఎంజి డోసు కలిగి ఉంటాయని, 100, 500 టాబ్లెట్ల పరిమానం కలిగిన బాటిళ్లలో ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ టాబ్లెట్లు ప్లాక్వెనిల్‌కు జెనరిక్‌ వెర్షన్‌ అని, దీనికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యుఎస్‌ఎఫ్‌డిఎ) నుంచి అనుమతి లభించినట్టు పేర్కొంది. ఐఎంఎస్‌ హెల్త్‌ గణాంకాల ప్రకారం అమెరికాలో ప్లాక్వెనిల్‌ బ్రాండ్‌, జెనరిక్‌ అమ్మకాలు 2018 మేతో ముగిసిన పన్నెండు నెలల కాలంలో 21.5 కోట్ల డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. బిఎస్‌ఇలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 0.73 శాతం నష్టంతో 2,302.70 రూపాయల వద్ద ముగిసింది.