అమెరికా సుప్రీం జడ్జిగా బ్రెట్ కావనాగ్
MarinaSkies
Kizen

అమెరికా సుప్రీం జడ్జిగా బ్రెట్ కావనాగ్

10-07-2018

అమెరికా సుప్రీం జడ్జిగా బ్రెట్ కావనాగ్

అమెరికా సుప్రీంకోర్టుకు జడ్జి బ్రెట్‌ కావనాగ్‌ను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. బ్రెట్‌ అద్భుతమైన న్యాయవాది అని ట్రంప్‌ వైట్‌హౌజ్‌లో పేర్కొన్నారు. జస్టిస్‌ అంథోనీ కెన్నడీ రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో అతని స్థానంలో మరో సుప్రీం జడ్జి కోసం ఇటీవల ట్రంప్‌ కొందర్ని ఇంటర్వ్యూ చేశారు. ఆ టీమ్‌లో భారత సంతతికి చెందిన అముల్‌ థాపర్‌ కూడా ఉన్నారు. మాజీ దేశాధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌కు అడ్వైజర్‌గా కూడా జడ్డి బ్రెట్‌ పనిచేశారు. జడ్జి కవనాగ్‌కు అసాధారణ అనుభవం ఉందని, అతని అర్హతలూ అనితరసాధ్యమని, సమ న్యాయం కోసం అతను కట్టబడి ఉన్నారని ట్రంప్‌ తన ప్రకటనలో తెలిపారు.