ట్రంప్‌ సహృదయం...ఛారిటీకి జీతం

ట్రంప్‌ సహృదయం...ఛారిటీకి జీతం

14-03-2017

ట్రంప్‌ సహృదయం...ఛారిటీకి జీతం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ తాజాగా మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ట్రంప్‌ తన జీతం మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నారట. ఈ విషయాన్ని ట్రంప్‌ పత్రికా కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ స్వయంగా వెల్లడించారు. ట్రంప్‌ వార్షిక అధ్యక్ష జీతం 4 లక్షల డాలర్లను ఛారిటీకి ఇవ్వనున్నట్లు స్పైసర్‌ తెలిపారు. ఏడాది చివరిన తన జీతాన్ని విరాళంగా ఇవ్వాలనేది ట్రంప్‌ ఉద్దేశ్యమని తెలిపారు. అంతేగాక, ఈ విషయమై ట్రంప్‌ ఇప్పటికే అమెరికా ప్రజలకు వాగ్దానమిచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ట్రంప్‌ తన జీతం గురించి ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాను జీతం తీసుకోవాలని అనుకోవట్లేదని, నిబంధనల కోసం ఒక్క డాలర్‌ను మాత్రమే తీసుకుంటానని ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే.