జూన్ 17న సాహిత్యంలో వినోదం

జూన్ 17న సాహిత్యంలో వినోదం

13-06-2018

జూన్ 17న సాహిత్యంలో వినోదం

ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం ప్రతి నెల నిర్వహించే ''నెల నెలా తెలుగు వెన్నెల'' సాహిత్య సదస్సు కు ఎంతో మంది సాహితీవేత్తలు ఇచ్చిన స్పూర్తితో, స్థానిక సాహితీ ప్రియుల సహకారంతో,  ''నెల నెలా తెలుగు వెన్నెల'' సాహిత్య సదస్సు 131వ మైలు రాయి చేరుకున్న తరుణంలో, జూన్‌ 17వ తేది ''సాహిత్యంలో వినోదం'' అనే అంశం పై సాహిత్య సదస్సు నిర్వహించబడుతున్నది. ఎంతో మంది సాహితీ వేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషకదాతలు మన భాష, సాహిత్యం, సంస్క తి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొదలు పెట్టిన ఈ సాహిత్య సదస్సు, దిన దినాభి వద్ధి చెందుతూ, సాహిత్య శోభ ను వెదజల్లుతూ, భావితరానికి స్పూర్తిదాయకమై, నిరాటంకంగా కొనసాగుతుంది. డా. ధూళిపాళ మహాదేవమణి గారు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. ఈ అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి, సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించి, చరిత్ర లో లిఖింపదగిన అద్వితీయమైన ఘట్టం లో భాగం కావలసిందిగా కోరుచున్నాము.

 http://tantex.org/eventSingle.php?event_id=382