ఇది సింగపూర్ కు దక్కిన గౌరవం

ఇది సింగపూర్ కు దక్కిన గౌరవం

13-06-2018

ఇది సింగపూర్ కు దక్కిన గౌరవం

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య కీలకమైన చరిత్రాత్మక చర్చలు విజయవంతంగా ముగియడం, ఆతిథ్య దేశంగా తమకు దక్కిన గౌరవమని సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ పేర్కొన్నారు. ఈ చర్చల ద్వారా మేలు మలుపు దిశగా అడుగులు పడ్డాయని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌లకు ఈ మేరకు ఒకే విధమైన లేఖల్ని ఆయన రాశారు. అణ్వస్త్ర రహిత కొరియా ద్వీపకల్పంలో సుస్థిరతకు, దీర్ఘకాల శాంతికి ఇదో కీలకమైన తొలి అడుగు అని దానిలో పేర్కొన్నారు. ఆ ఇద్దరు నేతలతో మళ్లీ కలిసే రోజు కోసం తాను ఎదురుచూస్తుంటానని చెప్పారు.