ట్రంప్ తో కుదరలేదు... కారుతోనే సెల్ఫీ

ట్రంప్ తో కుదరలేదు... కారుతోనే సెల్ఫీ

13-06-2018

ట్రంప్ తో కుదరలేదు... కారుతోనే సెల్ఫీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కారు ముందు నిల్చొని సెల్ఫీ దిగుతున్న ఈ యువకుడు భారత సంతతికి చెందిన మహరాజ్‌ మోహన్‌(25). మలేసియాలో నివాసముంటున్న మోహన్‌ ట్రంప్‌ను కలవాలనే కోరికతో సింగపూర్‌ వెళ్లి, ట్రంప్‌ దిగిన హోటల్‌లోనే బస చేశారు. ఇందుకోసం అతను ఒక్కరోజుకే రూ.38 వేలు చెల్లించాడు. మంగళవారం ఉదయం 6:30 గంటల నుంచి లాబీ బయట నిల్చుని పడిగాపులు కాసిన మోహన్‌కు 8 గంటల ట్రంప్‌ బయటకు వెళ్తున్న సమయంలో కనిపించాడు. ట్రంప్‌ మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఆయన కారుతో సెల్ఫీ దిగి సంతృప్తి పొందాడు.