సింగపూర్ లో ట్రంప్ పుట్టిన రోజు వేడుకలు

సింగపూర్ లో ట్రంప్ పుట్టిన రోజు వేడుకలు

12-06-2018

సింగపూర్ లో ట్రంప్ పుట్టిన రోజు వేడుకలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 72వ పుట్టిన రోజు వేడుకలు సింగపూర్‌లో జరిగాయి. ఈ నెల 14న ట్రంప్‌ పుట్టిన రోజు కాగా, తమ దేశానికి విచ్చేసిన సందర్భంగా సింగపూర్‌ ప్రధాని లీలుంగ్‌ ట్రంప్‌ పుట్టినరోజు వేడుకలను ముందుగానే నిర్వహించారు. సింగపూర్‌ అధ్యక్ష భవనం ఇస్తానాలో ట్రంప్‌ తన బర్త్‌డే కేక్‌ను కట్‌ చేశారు. ట్రంప్‌ కేక్‌ కట్‌ చేస్తున్న ఫోటో సింగపూర్‌ విదేశాంగ మంత్రి వినియన్‌ బాలకృష్ణన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. పుట్టిన రోజు వేడుకలను ట్రంప్‌ కాస్త ముందుగానే జరుపుకున్నారని బాలకృష్ణన్‌ కామెంట్‌ చేశారు.