అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్
APEDB
Ramakrishna

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్

14-03-2017

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్

అమెరికా తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతున్నది. మంచు తుఫాన్‌ తీవ్రమవడంతో మూడు కోట్ల మంది బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే 7600 విమానాలు రద్దయ్యాయి. వేలాది స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పటికే అధికారులు పలు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, విజిబిలిటీ జీరోకి పడిపోనుండటంతో అత్యవసరమైతే బయటకు రావాలని సూచించారు. అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మంచు తుఫాన్‌ కారణంగా ప్రభావితమవుతున్నట్లు సీఎన్‌ఎన్‌ చానెల్‌ వెల్లడించింది. న్యూయార్క్‌, బోస్టన్‌ లాంటి ప్రధాన నగరాలను మంచు దుప్పటి కప్పేస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు అడుగుల మేర భారీగా మంచు కురిచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ రిపోర్ట్‌ సృష్టం చేస్తుంది.