ఇజ్రాయెల్ సాకర్ క్లబ్ కు డొనాల్డ్ ట్రంప్ పేరు

ఇజ్రాయెల్ సాకర్ క్లబ్ కు డొనాల్డ్ ట్రంప్ పేరు

15-05-2018

ఇజ్రాయెల్ సాకర్ క్లబ్ కు డొనాల్డ్ ట్రంప్ పేరు

ఇజ్రాయెల్‌లోని మేటి సాకర్‌ క్లబ్‌ బీటార్‌ జెరూసలేం జట్టు పేరు మార్చుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరుతో ఈ సాకర్‌ క్లబ్‌ ముస్తాబైంది. ఇప్పుడు బీటార్‌ ట్రంప్‌ జెరూసలేంగా సాకర్‌ కిక్‌లు ఇవ్వనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యూఎస్‌ రాబయార కార్యాలయాన్ని టెల్‌ అవిన్‌ నగరం నుంచి జెరూసలేంకు మార్చడంతో ఆయన గౌరవార్థం ట్రంప్‌ పేరు చేర్చామని జట్టు వర్గాలు వెల్లడించాయి. ఈ జట్టు యూరోపా లీగ్‌కు అర్హత సంపాదించింది. ఆరుసార్లు ఇజ్రాయెల్‌ లీగ్‌ చాంపియన్‌ అయిన బీటార్‌ జట్టు అరబ్‌, ముస్లింలకు బద్ధ వ్యతిరేకి. ఆయా జట్లతో మ్యాచ్‌లు జరిగే సమయంలో బీటార్‌ జెరూసలేం వీరాభిమానులు వారికి వ్యతిరేకంగా నినదించేవారు. దీంతో పలుమార్లు హెచ్చరికలు, జరిమానాలకు కూడా గురైంది.