ట్రంప్ చట్టం వల్ల ప్రజలు దెబ్బతింటారు
Ramakrishna

ట్రంప్ చట్టం వల్ల ప్రజలు దెబ్బతింటారు

14-03-2017

ట్రంప్ చట్టం వల్ల ప్రజలు దెబ్బతింటారు

ఒబామాకేర్‌ స్థానంలో రిపబ్లికన్లు తీసుకు వస్తున్న చట్టం వల్ల ప్రధానంగా దెబ్బతినేది ప్రజలేనని లాస్‌ఏంజెల్స్‌ టైమ్స్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఒక్కో కౌంటీలో ఓట్లు, వారి ఆర్థిక రుణాల డేటాను విశ్లేషించిన పత్రిక ఈ మేరకు హెచ్చరిక చేసింది. ప్రతిపాదిత చట్టం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, దిగువ ఆదాయ వర్గాలకు చెందినవారు నష్టపోతారని పేర్కొంది. 60ఏళ్ళకు పైడి, 30వేల డాలర్ల వార్షికాదాయం వున్నవారు దీనివల్ల దెబ్బతింటారని తెలిపింది. ప్రస్తుతమున్న ఒబామా హెల్త్‌కేర్‌ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో అమెరికా పౌరులందరికీ ఉపయోగపడేలా చట్టాన్ని తీసుకువస్తారని హామీ ఇచ్చిన ట్రంప్‌ దానికి విరుద్ధంగా వ్యవహరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆ పత్రిక హెచ్చరించింది.