అమెరికాలో మళ్లీ జాత్యహంకార దాడి
APEDB
Ramakrishna

అమెరికాలో మళ్లీ జాత్యహంకార దాడి

14-03-2017

అమెరికాలో మళ్లీ జాత్యహంకార దాడి

అమెరికాలో మరోసారి జాత్యహంకార ఎగిసిపడింది. శ్రీనివాస్‌ కూచిభోట్లను కాల్చి చంపగా, మరో భారతీయుడు సోర్ట్‌ను తగులబెట్టేశారు. తాజాగా పిలడెల్ఫియాలో తెలుగు మహిళపై దుండగుడు జాత్యహంకార దాడికి పాల్పడ్డారు. కత్తితో ఆమెపై దాడికి  పాల్పడ్డాడు. కత్తితో ఆమెపై దాడికి దిగిన దుండగుడు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ ఘటన అమెరికాలో ఉంటున్న భారతీయలందర్నీ ప్రధానంగా తెలుగువారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో భయాందోళనలకు గురైన తెలుగు ఎన్నారైలు ఈ ఘటనతో అమెరికాలో ఉండటంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ దాడిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.