స్మార్ట్ ఫోన్ లో నోటిఫికేషన్లకు చెక్!
Sailaja Reddy Alluddu

స్మార్ట్ ఫోన్ లో నోటిఫికేషన్లకు చెక్!

14-03-2017

స్మార్ట్ ఫోన్ లో నోటిఫికేషన్లకు చెక్!

ముఖ్యమైన పనిలో ఉన్నపుడు ఫోన్‌ మోగితే, పుస్తకంలో లీనమైనపుడు సందేశం వచ్చిందంటూ బీప్‌ శబ్దం వినిపిస్తే? ఎందుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌రా బాబూ అనిపించకమానదు. బిజీగా ఉన్నపుడు ఇలాంటి సందేశాలను పంపే ఆపరేటర్లపై కోపం రావడమూ సహజమే. అయితే, ముందు ముందు ఈ సమస్య ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. పనిలో నిమగ్నమైన సమయంలో ఇలాంటి సందేశాలు రాకుండా, మీరు తీరిగ్గా ఉన్నపుడే వాటిని అందించే సరికొత్త మాడల్‌ను అభివృద్ధి చేశామని రగ్టర్‌ యూనివర్సిటీ  శాస్త్రవేత్తలు వివరించారు.  దీని సాయంతో మీ స్మార్ట్‌ఫోనే మీ సెక్రటరీగా మారిపోతుందని, అనవసరమైన సందేశాలు, కాల్స్‌ మీ వరకూ రానీయకుండా ఆపేస్తుందని తెలిపారు. ముందుగా ఫోన్‌ వాడకాన్ని నిశితంగా పరిశీలిచడంద్వారా మీరు బిజీగా ఉండే సమయం, తీరిగ్గా ఉండే సమయాలకు సంబంధించి ఓ అంచనాకు వస్తుందని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జేన్‌ లిండ్కివిస్ట్‌ వివరించారు.