పాముకాటుకు చవకైన మందు!

పాముకాటుకు చవకైన మందు!

14-03-2017

పాముకాటుకు చవకైన మందు!

పాముకాటుకు అత్యంత చవకైన, బాగా పనిచేసే విషసంహారక మందును కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తయారుచేశారు. సర్పకాటు కారణంగా ఆఫ్రికా, భారత్‌లలో సంభవిస్తున్న వేలాది మరణాలను అరికట్టడంలో ఈ పరిశోధన నిజంగానే చీకట్లో కాంతిరేఖ వంటిదని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 45 లక్షల మంది పాముకాటుకు గురవుతుండగా, లక్ష మందికి పైగా మృతి చెందుతున్నారు. ప్రస్తుతమున్న విష సంహారకాలు కొన్నిరకాల పాముల విషాన్నే అడ్డుకుంటున్నాయి. పైగా బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లి, సిరల ద్వారా వారి శరీరంలోకి ఈ మందులు ఎక్కించాల్సి వస్తోంది. ఎక్కడో మారుమూల పల్లెల నుంచి బాధితులను ఆసుపత్రిలోకి తీసుకొచ్చి, ఈ చికిత్స అంతా అందించేలోపే పరిస్థితి విషమించి పోతోంది. ఈ సమస్యలపై దృష్టి సారించిన ఒ బ్రియోన్‌, కెన్నెత్‌ షియాల బృందం పాలిమర్‌ నానోజెల్‌ (నానో డోట్‌) పదార్థంలో లేపనం తయారుచేశారు. ఇది అత్యంత ప్రమాదకర పాముల విషాన్ని కూడా ఇట్టే అడ్డుకోగలదట.