టూరిజం శాఖ వినూత్న ప్రణాళిక

టూరిజం శాఖ వినూత్న ప్రణాళిక

19-04-2018

టూరిజం శాఖ వినూత్న ప్రణాళిక

తెలంగాణలో పర్యాటకరంగాన్ని విస్తతం చేసేందుకు రాష్ట్ర టూరిజంశాఖ వినూత్న ప్రణాళికను సిద్ధంచేసింది. ప్రవాస తెలంగాణ వాసులను అంబాసిడర్‌ లుగా నియమించేందుకు పర్యాటకశాఖ కసరత్తు చేస్తున్నది. తెలంగాణ వచ్చేవరకు ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించిన ఎన్నారైలకు గుర్తింపు వచ్చేలా.. ఈ అంబాసిడర్‌ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ ప్రణాళిక సిద్ధమైన తర్వాత తెలంగాణ టూరిజానికి అంబాసిడర్‌గా గుర్తింపు పొందాలనుకొనేవారు ఆన్‌లైన్‌లో తమ పేరును నమోదు చేసుకోవచ్చు. తెలంగాణ అంబాసిడర్లుగా గుర్తింపు పొందినవాళ్లు తాముంటున్న దేశాల్లోని పర్యాటకులను తెలంగాణలో పర్యటించేలా ప్రచారం చేయాల్సి ఉంటుంది.