వైట్ హౌస్ ఇంధన సలహాదారు రాజీనామా

వైట్ హౌస్ ఇంధన సలహాదారు రాజీనామా

19-04-2018

వైట్ హౌస్ ఇంధన సలహాదారు రాజీనామా

ఇంధన, పర్యావరణ వ్యవహారాలపై వైట్‌హస్‌ ఉన్నత సలహాదారు మైఖేల్‌ కెటంజారో రాజీనామా చేయనున్నారు. ఈ పదవికి రాజీనామా చేసి గతంలో పనిచేసిన సీజీసీఎస్‌ గ్రూపుకే ఆయన వస్తున్నారు. ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కార్యాలయానికి చెందిన ఫ్రాన్సిస్‌ బ్రూక్‌ నియమితులు కానున్నారు. శిలాజ అనుకూల ఇంధన ఎజెండాను ట్రంప్‌ ప్రకటించడంలో కెటంజారో కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా తన హయాంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తీసుకున్న పలు చర్యలను ట్రంప్‌ ప్రభుత్వం తొలగించింది. వాటివల్ల వాణిజ్య పురోగతికి ఆటంకం కలుగుతోందని ట్రంప్‌ పేర్కొన్నారు.