న్యూయార్క్ లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్

న్యూయార్క్ లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్

18-04-2018

న్యూయార్క్ లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అధికారిక పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ పోలీసు ఉన్నతాధికారులతో  సమావేశమయ్యారు. వివిధ దేశాల పోలీసు ఉన్నతాధికారులతో యూఎస్‌లో జరుగుతున్న ప్రత్యేక సెమినార్‌కు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హాజరైన విషయం తెలిసిందే. ఈ నెల 9న బయలుదేరిన పోలీస్‌ కమిషనర్‌ యూఎస్‌లోని వివిధ నగరాల్లో పర్యటించి అక్కడి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ దేశాల నుంచి ప్రధాన నగరాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. వారివారి నగరాల్లో చేపడుతున్న దర్యాప్తు తీరు, పోలీసు వ్యవస్థలో ఆధునిక పద్ధతులు, టెక్నాలజీ వినియోగం లాంటి అంశాలపై సెమినార్‌ సాగుతోంది. యూఎస్‌లోని వివిధ నగరాలు తిరిగి పరిశీలిస్తున్న అంజనీకుమార్‌ అక్కడి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరును, ఇతర దర్యాప్తు పద్ధతులను కూడా అధ్యయనం చేస్తున్నారు.