ఖాతా లేకున్నా డేటా సేకరిస్తాం

ఖాతా లేకున్నా డేటా సేకరిస్తాం

18-04-2018

ఖాతా లేకున్నా డేటా సేకరిస్తాం

వినియోగదారులు తమ వెబ్‌సైట్‌లో నిర్వహించిన కార్యకలాపాల ద్వారానే కాకుండా ఇతర మార్గాల్లోనూ డేటా సేకరిస్తామని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ తెలిపింది. ప్రొఫైల్స్‌లో యూజర్లు ఇచ్చే సమాచారంతో పాటు మరెంతో డేటాను సేకరిస్తామని ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ గతవారం అమెరికా కాంగ్రెస్‌కు చెప్పడం తెల్సిందే. తాజాగా ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ ఓ పోస్ట్‌ చేస్తూ మా సర్వీసులను వాడే వెబ్‌సైట్‌ లేదా యాప్‌ను మీరు ఓపెన్‌ చేస్తే తర్వాత మీకు లాగ్‌ అవుట్‌ అయినా, మీకసలు ఫేస్‌బుక్‌ ఖాతా లేకున్నా మీ డేటా మాకు అందుతుంది అని అన్నారు. ఫేస్‌బుక్‌ను వాడుతున్నవారెవరో, వాడని వారెవరో ఆయా యాప్‌లు, వెబ్‌సైట్లకు తెలీదు కాబట్టి అందరి సమాచారాన్ని తమకు పంపుతాయన్నారు. ప్రకటన ఆదాయం కోసం గూగుల్‌, ట్వీటర్‌ వంటి సంస్థలూ ఈ విధానాన్నే అనుసరిస్తాయన్నారు.