వైయ‌స్సార్‌సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

వైయ‌స్సార్‌సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష

16-04-2018

వైయ‌స్సార్‌సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష

ప్రత్యేకహోదాకి మద్దతుగా డాలస్ లో వైయ‌స్సార్‌సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు అరవింగ్లో  ఉన్న గాంధీ ప్లాజా వద్ద ఈదీక్ష చేయటం జరిగింది. ఈ దీక్షలో అనేకమంది తెలుగువాళ్లు పాల్గొని మద్దతు తెలిపారు. సాయంత్రం 7 గంటలకి దీక్షని విరమించిన తరువాత జరిగిన మీడియా సమావేశంలో అనేక మంది వక్తలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఎండగట్టం జరిగింది. వాతారణం అనుకూలించకపోయినప్పటికీ తీవ్రమైన చలిగాలులుని సైతం లెక్కచేయకుండా తెలుగు ప్రజలు నిరసన దీక్షలో పాల్గొనటం జరిగింది.

రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే ఇప్పుడు హోదాని అడ్డుకొనిటీడీపీ బీజేపీలు అన్యాయం చేస్తున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు అనేక కేసులలో ఇరుక్కోవటం మూలానే కేంద్రంతో రాజీపడి హోదాని తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయుకుడు జగన్మోహనరెడ్డి గారు చేస్తున్న అలుపెరగని పోరాటం కారణంగానే ప్రత్యేకహోదా ఉద్యమమం సజీవంగా ఉందని ప్రత్యేకహోదా సాధించే సత్తా ఒక్క జగన్మోహనరెడ్డి గారికే ఉందని ఆంధ్రప్రదేశ్  ప్రజలు జగన్మోహనరెడ్డి గారికి అండగా నిలవాలని వక్తలు పిలుపునిచ్చారు.

గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో వైస్సార్సీపీ ఎంపీలు పట్టుదలగా వరసగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారని అంతేకాకుండా చివరకు కేంద్రం వైఖరికి నిరసనగా తమ ఎంపీ పదవులకి రాజీనామాలు చేసారని , ఆ తరువాత 6 రోజులపాటు అమరణనిరాహార దీక్ష చేశారని ఎంపీలని అభినందించారు. ఎంపీల స్ఫూర్తితోనే ఈరోజు ఇక్కడ ఒకరోజు నిరాహారదీక్ష చేయటం జరిగిందని నిర్వాకులు పేర్కొన్నారు. 

గతంలో కేజీబేసిన్ ని అంబానీలకి కట్టబెట్టి చంద్రబాబు ఆంధ్రప్రజలకి తీరని అన్యాయం చేసాడని, మళ్ళీ ఇప్పుడు పోలవరం ముడుపుల కోసం ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టాడని, ఇలా ప్రతిసందర్భంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్  ప్రజలని మోసం చేస్తున్నాడని వక్తలు ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకి బుద్ధి చెప్పి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న జగన్మోహనరెడ్డి గారికి అండగా నిలబడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి NRI లు విజ్ఞప్తి చేసారు.

నిరసన దీక్షలో శ్రీకాంత్ రెడ్డి జొన్నల, చందు రెడ్డి చింతల, శివ రెడ్డి వెన్నం, కృష్ణారెడ్డి కోడూరు, మణి అన్నపురెడ్డి, రామి రెడ్డి బూచిపూడి, రమణారెడ్డి పుట్లూరు, ప్రసాదరెడ్డి చొప్పా, కులశేఖర్, ఉమా మహేశ్వర్ రెడ్డి కుర్రి, భాస్కర్ గండికోట, ఉమా మహేశ్వర్ పార్నపల్లి, అవినాష్ రెడ్డి వెల్లంపాటి, శ్రీనివాస్ రెడ్డి ఓబుల్రెడ్డి, చైతన్య రెడ్డి, సునీల్ దేవిరెడ్డి, జయసింహ రెడ్డి, మధు మల్లు, తిరుమల రెడ్డి కుంభమ్, తేజ నందిపాటి, పాల్, కిరణ్ సాలగాల, తిరుపతిరెడ్డి పేరం, మల్లికార్జున మురారి, హేమంత్, యశ్వంత్  చైతన్య, జగదీష్, రవి కదిరి, శరత్ యర్రం, ఉదయ్, శ్రావణ్, మహేష్ కురువ  తదితరులు పాల్గొని ప్రసంగించారు. నిరసన దీక్షలో పాల్గొన్న తెలుగు వారందరికీ మరియు మద్దతునిచ్చిన మీడియా సంస్థలు సాక్షి, TV5, TV9, NTV, V6, Desi Plaza వారికి నిర్వాకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. 

Click here for Photogallery