అమెరికాలో బందరువాసి మృతి

అమెరికాలో బందరువాసి మృతి

14-04-2018

అమెరికాలో బందరువాసి మృతి

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వ్యక్తి అమెరికాలో ప్రమాదవశాత్తూ మృతి చెందారు. పట్టణానికి చెందిన నాయుడు రవీంద్ర కుమారుడు లీలా నాగేశ్వర ప్రసాద్‌ కొన్నేళ్లుగా కాలిఫోర్నియాలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కంపెనీ పని నిమిత్తం డెలవేర్‌కు వెళ్లారు. ఆ రాత్రి ఆయన బస చేసిన ప్రాంతంలో స్విమ్మింగ్‌పూల్లో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రసాద్‌(42) మునిగిపోయి మృతిచెందారు. తెల్లవారిన తరువాత స్విమ్మింగ్‌ పూల్లో మృతదేహాన్ని గమనించిన అక్కడి వ్యక్తులు తమకు సమాచారం ఇచ్చారని, ప్రసాద్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలియగానే అతని తండ్రితోపాటు బంధువులు కొందరు అమెరికాకు వెళ్లారు. ప్రసాద్‌ అమెరికాలో ఉంటున్నా, మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు పేద విద్యార్థుల చదువుకునేందుకు సాయం చేసేవారు.