మాఫియాకు బాస్ గా డొనాల్డ్ ట్రంప్

మాఫియాకు బాస్ గా డొనాల్డ్ ట్రంప్

14-04-2018

మాఫియాకు బాస్ గా డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలి చూస్తే తనకు ఓ మాఫియా నాయకుడి తీరు స్ఫురించేదని ఎఫ్‌బీఐ మాజీ సంచాలకుడు జేమ్స్‌ కోమే పేర్కొన్నారు. అసలాయన ప్రభుత్వాన్ని ఓ ముఠానాయకుడి తరహాలోనే నడిపించారన్నారు. ప్రతి ఒక్కరూ తనకు దాసోహం అనాలన్న ధోరణి ట్రంప్‌దని కోమే తన తాజా పుస్తకంలో పేర్కొన్నారు. అసలాయన ప్రతి విషయానికీ అసత్యమే చెప్పారన్నారు. వాస్తవానికి వచ్చే మంగళవారం అధికారికంగా విడుదల కావలసీ ఉన్న ఎ హయ్యర్‌ లాయల్టీ ట్రూత్‌, లైస్‌ అండ్‌ లీడర్‌షిప్‌ అనే ఈ కొత్త పుస్తకం. వివరాలు కొన్నింటిని అమెరికా మీడియా శుక్రవారం వెలుగులోకి తెచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రంప్‌కి అసలు తప్పొప్పుల విచక్షణే లేదని జేమ్స్‌ పేర్కొన్నారు. ఈ తాజా పుస్తకంలో వ్యవహారం ఇప్పటికే శ్వేతసౌధం, రిపబ్లికన్‌ వర్గాల్లో గుబులుపుట్టిస్తోంది.