టిపిఎడి రక్తదానశిబిరం

టిపిఎడి రక్తదానశిబిరం

13-04-2018

టిపిఎడి రక్తదానశిబిరం

తెలంగాణ పీపుల్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ (టీపీఏడీ) ఆధ్వర్యంలో డల్లాస్‌, ఫ్రిస్కో, టెక్సాస్‌లలో మార్చి 31వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది ఔత్సాహికులు, విద్యార్థులు పాల్గొని రక్తాన్ని దానమిచ్చారు. 25 యూనిట్ల రక్తం సేకరించామని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో యూనిట్‌ రక్తంతో మూడు ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. బ్లడ్‌ డోనేట్‌ చేసిన దాతలు టీపీఏడీకి అభినందనలు తెలిపారు. పుట్టిన గడ్డకు సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి అమెరికన్‌పై ఉందని కార్యక్రమ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. బ్లడ్‌ డ్రైవ్‌ నిర్వహించడం వ్యక్తిగతంగా తమకెంతో సంతప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. వలంటీర్లు, బ్లడ్‌ డోనర్లకు బసేర ఇండియన్‌ రెస్టారెంట్‌లో అల్పాహరం అందించారు. జస్ట్‌బై ఆన్‌లైన్‌ స్టోర్‌ నిర్వహిస్తున్న మహిళా ఎంటర్‌ప్రిన్యూర్‌ వలంటీర్లకు టీ-షర్టులు, క్యాప్‌లు అందించారు.

Click here for Event Gallery