కేటీఆర్ తో అమెరికా ప్రతినిధుల భేటీ

కేటీఆర్ తో అమెరికా ప్రతినిధుల భేటీ

13-04-2018

కేటీఆర్ తో అమెరికా ప్రతినిధుల భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావుతో అమెరికా నుంచి వచ్చిన కాంగ్రెస్‌ ప్రతినిధులు టెరి ఎ.స్వెల్‌, డినా టిటుస్‌ సమావేశమయ్యారు. ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ వారికి రాష్ట్రంలో పారిశ్రామిక రంగ ప్రగతి, ఐటీ, జీవశాస్త్రాలు, వైమానిక, రక్షణ రంగాల్లో పురోగతి గురించి వివరించారు. తెలంగాణలో అమెరికా కంపెనీల పెట్టుబడులు, కార్యకలాపాల గురించి చెప్పారు. అనంతరం అమెరికా ప్రతినిధులు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని మర్యాదపూర్వకంగా కలిశారు.