శాండియోగోలో ఉల్లాసంగా ఉగాది వేడుకలు

శాండియోగోలో ఉల్లాసంగా ఉగాది వేడుకలు

13-04-2018

శాండియోగోలో ఉల్లాసంగా ఉగాది వేడుకలు

శాండియేగోలోని తెలుగు వాళ్ళు విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. స్థానిక తెలుగు అసోసియేషన్‌ 'శాంటా' ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది వేడుకలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. శాండియేగో జోన్‌ క్రోక్‌ థియేటర్లో నిర్వహించిన విళంబి నామ సంవత్సర ఉగాది ఉల్లాసం కార్యక్రమాన్ని అన్నపూర్ణ రెస్టారెంట్‌ వారు సమర్పించగా కలర్‌ షాట్స్‌ స్టూడియో వారు ఫోటోగ్రఫీ సేవలందించారు. విఘ్నేశ్వరునికి జ్యోతి ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమం, స్థానిక ప్రతిభావంతమైన సాంస్క తిక కార్యక్రమాలు, తెలుగు సినీ గాయకుల పాటల హరివిల్లుతో  హోరు మన్నది. మధ్యలో అతిలోక సుందరి శ్రీదేవిని స్మరిస్తూ ఆమె నటించిన సినిమాల్లోని పాటలకు చిన్నారులు చేసిన న త్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమీరా పార్థసారధి ల పాటలకు చిన్న పెద్ద అందరూ వేదిక మీదకు వచ్చి డాన్సులు చెయ్యడం కొసమెరుపు. ఈ సందర్భంగా స్పాన్సర్స్‌ మరియు సమీరా పార్థసారధిలను శాంటా కార్యవర్గం ఘనంగా సత్కరించింది.

Click here for Event Gallery