బే ఏరియాలో జే తాళ్ళూరి ప్రచారం

బే ఏరియాలో జే తాళ్ళూరి ప్రచారం

13-03-2017

బే ఏరియాలో జే తాళ్ళూరి ప్రచారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ పదవికి పోటీ పడుతున్న జే తాళ్ళూరి ఆదివారం రాత్రి బే ఏరియాలో విస్తృత ప్రచారం చేశారు. మిల్‌పిటాస్‌లోని స్వాగత్‌ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఆయన తానా సభ్యులను కలుసుకుని తనను గెలిపించాల్సిందిగా కోరారు. తనను గెలిపిస్తే తానా ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపజేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటితోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. సతీష్‌ వేమూరి, శ్రీకాంత్‌ దొడ్డపనేని, మధు రావెళ్ళ, బాటా నాయకురాలు విజయ ఆసూరి, వినయ్‌ పరుచూరి తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చారు.