జుకర్ బర్గ్ మరో తీపి కబురు చెప్పారు
Agnathavasi
Ramakrishna

జుకర్ బర్గ్ మరో తీపి కబురు చెప్పారు

11-03-2017

జుకర్ బర్గ్ మరో తీపి కబురు చెప్పారు

ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌ మరో తీపి కబురు చెప్పారు. జుకర్‌ ఇంటికి త్వరలోనే మరో చిన్నారి రాబోతుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పోస్టు చేశారు. జుకర్‌ భార్య ప్రిసిల్లా చాన్‌ త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది.  మా ఇంటికి మరో చిన్నారి రాబోతుందని తెలిసి చాలా ఆనందంగా ఉన్నాం. మొదట మాకు పిల్లలే పుట్టరని అనుకున్నాం. మాక్స్‌ పుట్టాక మాసంతోషానికి హద్దే లేదు. ఆ తర్వాత కూడా మళ్లీ మరో చిన్నారి మా ఇంటికి వస్తుందో లేదో కూడా తెలియదు కానీ ప్రిసిల్లా గర్భవతి అని తెలియగానే ఆ బిడ్డ కూడా ఆడపిల్లే కావాలని కోరుకుంటున్నాం. సోదరి కంటే గొప్ప బహుమతి మరొకటి ఉంటుందని నేను అనుకోను.  నేను ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసి పెరిగాను. వారు నాకు కేవలం సోదరీమణులే గాక, మంచి స్నేహితులు కూడా. ప్రిసిల్లాకు కూడా ఇద్దరు సోదరిమణులున్నారు. అలాంటి గొప్ప మహిళలు మా జీవితంలో ఉన్నందు వల్లే మేం ఈ రోజు ఇలా సంతోషంగా ఉన్నాం. అందుకే మాక్స్‌కి కూడా చెల్లెలు పుట్టాలని కోరుకుంటున్నాం. ఆమెను కూడా మరో శక్తిమంతమైన మహిళగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం అంటూ జుకర్‌ ఫేస్‌బుక్‌లో ఖాతాలో రాసుకొచ్చారు.