ఈనెల 18న 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ వేడుక
APEDB
Ramakrishna

ఈనెల 18న 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ వేడుక

13-03-2017

ఈనెల 18న 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ వేడుక

పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు. మిగిలివున్న రెండు పాటల కోసం యూరప్‌కు వెళ్లిన చిత్రబృందం అక్కడ వాటి చిత్రీకరణ పూర్తిచేసింది. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తయింది. మరోపక్క నిర్మాణానంతర పనులు తుదిదిశకు చేరుకున్నాయి. ఒక పాట తర్వాత మరొక పాటను విడుదల చేస్తున్న చిత్రబృందం మూడోపాటను విడుదల చేసింది. వీటన్నింటికీ విశేషమైన ఆదరణ లభించిందని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ నెల 18న ప్రీ రిలీజ్‌ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు, సినిమాను ఇదేనెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కిషోర్‌కుమార్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో నార్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ నాయికగా నటిస్తుండగా, ఇతర ప్రాతల్లో శివబాలాజీ, కమల్‌ కామరాజు, అజయ్‌, ఆలీ, నాజర్‌, రావు రమేష్‌, వేణుమాధవ్‌, తరుణ్‌ అరోరా, చైతన్యకృష్ణ, మణికంఠ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఛాయగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ళ, సంగీతం: అనూప్‌ రుబెన్స్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు.