అమితాబ్ కు అస్వస్థత

అమితాబ్ కు అస్వస్థత

13-03-2018

అమితాబ్ కు అస్వస్థత

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అస్వస్థతకు గురయ్యారు. విజయ్‌కృష్ణ ఆచార్య థగ్స్‌ ఆఫ్‌ హిండోస్థాన్‌ చిత్రం షూటింగ్‌ జోథ్‌పూర్‌లో జరుగుతుండగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, షూటింగ్‌ తిరిగి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముంబై నుంచి వైద్యుల బృందం హుటాహుటిన జోథ్‌పూర్‌కు చేరుకుంది. అయితే ఈ రోజు ఉదయం కూడా పలు ట్వీట్స్‌ చేసిన అమితాబ్‌ సడెన్‌గా అస్వస్థతకి గురి కావడంతో ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఆయన అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.