ఈ అభినందన నన్ను ఆనందంలో ముంచెత్తింది - చంద్ర బోస్

ఈ అభినందన నన్ను ఆనందంలో ముంచెత్తింది - చంద్ర బోస్

13-03-2018

ఈ అభినందన నన్ను ఆనందంలో ముంచెత్తింది  - చంద్ర బోస్

నేను నా సాహితీ ప్రస్థానంలో ఎన్నో పాటలు రాసాను-ఎన్నో పురస్కారాలు, అభినందనలు అందుకున్నాను-కాని ఈ ఎంత సక్కగున్నావే పాటకు వస్తున్న స్పందన మాత్రం అపూర్వం-దాదపు 15 రోజులు నా ఫోన్ మోగుతూనే వుంది -ప్రశంసల జల్లు కురుస్తూనే వుంది-సినిమా ప్రముఖులు, స్నేహితులు,బంధువులు, పరిచయస్తులు అందరి నుండి అన్ని వర్గాల నుండి ఈ అభినందనలు నన్ను ఆనందంలో మంచెత్తాయి-అయితే ఆశ్చర్యనందానికి గురి చేసిన విషయం మీతో పంచుకోబోతున్నాను-వంశీ కమల్ అనే అబ్బాయి ఈ పాటతో స్ఫూర్తి పొంది ఈ పాట రాసిన నా గురించి  ఒక పాట రాసాడు-యిదే పాట వరసలో-నాకు చాలా వినూత్నంగా అనిపించి విస్మయాన్ని కలిగించింది-నేను దీనికి అర్హుడినో కాదో గాని ఒక తెలుగబ్బాయి హృదయాన్ని కదిలించి కవిత్వం పలికించాన్న తృప్తి కలిగుతోంది-ఆ పాట లంకె యిక్కడ వుంది-మీరు కూడా విని తనని ఆదరించండి - మీ చంద్ర బోస్