సెన్సార్ పూర్తి చేసుకున్న 'మరో అడుగు మార్పు కోసం'

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మరో అడుగు మార్పు కోసం'

09-03-2018

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మరో అడుగు మార్పు కోసం'

'వేట' అనే మిని మూవీకి బెస్ట్‌ డైరెక్టర్‌ గానూ, రెండు చిల్డ్రన్స్‌ ఫిలింస్‌ రెండు బెస్ట్‌ ప్రొడక్షన్స్‌ గానూ, హ్యాట్రిక్‌ గోల్డెన్‌ నంది అవార్డులు అందుకున్న సినీ నటుడు 'చంటి' ఫేం ఐనవోలు ప్రసన్న కుమార్‌ ఇప్పుడు సినీ రంగంలో నిర్మాతగా మారి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే మరియు దర్శకుడిగా అన్నీ తానై నిర్మించిన సినిమా 'మరో అడుగు మార్పు కోసం'.

మితాస్‌ విజన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1 గా నిర్మించిన 'మరో అడుగు మార్పు కోసం' చిత్రం ఇటీవలే సెన్సార్‌ కార్యమ్రాలు పూర్తి చేసుకొని యు సర్టిఫికెట్‌తో అందరి ప్రశంసలు అందుకుంది. ఐనవోలు ప్రసన్న కుమార్‌ ఈ చిత్రంలో కీలకమైన ముఖ్యమంత్రి పాత్రను పోషించగా.. హీరోగా అఖిల్‌ కార్తీక్‌ నటించాడు. ఇతర పాత్రలలో ఎఫ్‌.యం.బాబాయ్‌, యస్‌.పవిత్ర, రోజావర్మ, యల్లంనాయుడు, జమునా రాణి, కుమార్‌, మంత్రి మూర్తి, పొట్టి మూర్తి, వామనరావు, వాసు గౌడ్‌ మొదలైన వారు నటించారు. ఒకే కులం, ఒకే మతం అందరూ ఒక్కటే అని నమ్మిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కలలను సాకారం చేయాలన్న సంకల్పంతో అందరికీ ఆర్థిక సమానత్వాన్ని సాధించటానికి చేసిన ప్రయత్నమే 'మరో అడుగు మార్పు కోసం' చిత్రం.

అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనే విధంగా తమ చిత్రం వుంటుందని ప్రజల ఆశయాలు ఆకాంక్షలు తీర్చే చిన్న ప్రయత్నం ఈ చిత్రం ద్వారా చేసామని నిర్మాత, దర్శకుడు ఐనవోలు ప్రసన్న కుమార్‌ చెప్పారు. అంతే కాకుండా ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌, ఎడిటింగ్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌, యానిమేషన్స్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా లియో 9, వి.ఎఫ్‌.ఎక్స్‌., సునీల్‌ చరణ్‌ గారు ఎంతో అద్భుతంగా చేసారని నిర్మాత తెలియజేసారు.

 ఈ చిత్రాన్ని డా||మృణాల్‌ ధర్మిత సమర్పించగా.. కెమెరామెన్‌ : బండి చక్రపాణి, రమణ, మ్యూజిక్‌: సాకేత్‌, నరేష్‌, 5.1: వెంకట్‌, మేకప్‌ & కాస్ట్యూమ్‌ : శ్రీను, (వైజాగ్‌) స్టూడియో : ప్రదీప్‌ స్టూడియో, అసోసియేట్‌ డైరెక్టర్‌ : రవి బోనెల, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత : ఐనవోలు ప్రసన్న కుమార్‌.