ఆస్కార్ లో కొత్త రికార్డు
APEDB

ఆస్కార్ లో కొత్త రికార్డు

06-03-2018

ఆస్కార్ లో కొత్త రికార్డు

90వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో కొత్త రికార్డు నమోదైంది. కాల్‌ మీ బై యువర్‌ నేమ్‌ సినిమాకు బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే అవార్డు దక్కించుకున్న జేమ్స్‌ ఐవరీ 89 ఏండ్ల వయసులో ఆస్కార్‌ గెలుచుకున్న అతిపెద్ద వయసు వ్యక్తిగా రికార్డుకెక్కారు. ఆస్కార్‌ గెల్చుకున్న వయో వృద్ధుడుగా ఎన్నియో మోర్రికోన్‌ పేరిట ఉన్న రికార్డు (87 ఏండ్ల వయసు)ను జేమ్స్‌ ఐవరీ బద్దలుకొట్టారు. 2016 లో ది హేట్‌పుల్‌ ఎయిట్‌ సినిమాకు గాను ఎన్నియో మోర్రికోన్‌ ఆస్కార్‌ గెల్చుకున్నారు. కాగా, జేమ్స్‌ ఐవరీ స్క్రీన్‌ప్లే సమకూర్చిన 31 సినిమాలు ఇప్పటివరకు నామినేట్‌ కాగా, అరు సినిమాలకు ఆస్కార్‌ అవార్డులు వరించాయి.