ఈ నెల 29న ఎన్టీఆర్ సినిమా ప్రారంభం

ఈ నెల 29న ఎన్టీఆర్ సినిమా ప్రారంభం

05-03-2018

ఈ నెల 29న ఎన్టీఆర్ సినిమా ప్రారంభం

ఈ నెల 29న ఎన్టీఆర్‌ సినిమాను  ప్రారంభిస్తామని సినీనటుడు, హిందూపురం  ఎమ్మెల్యే  బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈరోజు ఆయన అమరావతిలోని సచివాలయానికి వచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదని చెప్పారు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమాకు చాలా మంది చాలా పేర్లు సూచించారని తెలిపారు. ఎన్టీఆర్‌కు మంచిన పేరు లేదని భావించే ఆ పేరే ఖరారు చేశామని వెల్లడించారు. ఎన్టీఆర్‌ను పార్టీలకతీతంగా అందరూ అభిమానించారని అన్నారు. ఈ నెల 31, ఏప్రిల్‌ 1న లేపాక్షి ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.