బాహుబలి 2 మరో రికార్డు!
Sailaja Reddy Alluddu

బాహుబలి 2 మరో రికార్డు!

03-03-2018

బాహుబలి 2 మరో రికార్డు!

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన అద్బుత దృశ్యకావ్యం బాహుబలి 2 ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా సంగీతం పరంగా మరో అరుదైన మైలురాయిని దక్కించుకుంది. ఈ సినిమాలో భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి పాట యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ (10 కోట్లు) దక్కించుకుంది. 2 లక్షల మందికి పైగా పాట బాగుందని లైక్‌ చేశారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో ఈ ఘనతను సాధించిన తొలి పాట ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.