వైఎస్ ఆర్ యాత్ర?

వైఎస్ ఆర్ యాత్ర?

03-03-2018

వైఎస్ ఆర్ యాత్ర?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ రాబోతోంది. మహిత్‌ రాగవ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో ఈ దర్శకుడు ఆనందో బ్రహ్మ సినిమాకు దర్శకత్వం వహించారు. స్క్రిప్టు వర్క్‌ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. వైఎస్‌ఆర్‌ పాత్రలో మలయాళం నటుడు మమ్ముట్టి నటించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు మమ్ముట్టి ఈ సినిమాలో నటించటానికి అంగీకారం తెలిపినట్లు తెలిసింది. కాగా ఈ చిత్రానికి యాత్ర అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.